‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!- Friendship Day Quotes (2022)

ఫ్రెండ్ షిప్ డే (Friendship Day).. తెలుగులో ఇదే రోజును స్నేహితుల దినోత్సవం అని కూడా అంటాం. మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగష్టు మాసంలో వచ్చే తొలి ఆదివారం నాడు దీనిని జరుపుకోవడం ఆనవాయితి. ఈ రోజున తమకు ప్రియాతి ప్రియమైన స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడం… వారికి బహుమతులు ఇవ్వడం చేస్తుంటారు. మన జీవితంలో ప్రధానమైన పాత్ర పోషించే స్నేహితులను స్మరించుకుంటూ.. వారికోసం ఒక రోజును అంకితమివ్వడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

Table of Contents

 1. స్నేహితుల దినోత్సవం చరిత్ర (Friendship Day History)
 2. ఫ్రెండ్ షిప్ డే కోట్స్ (Friendship Day Quotes In Telugu)
 3. స్నేహితురాలి కోసం ఫ్రెండ్ షిప్ డే మెసేజస్.. (Friendship Day Wishes For Her)
 4. మీ స్నేహితుడికి పంపే ఫ్రెండ్ షిప్ మెసేజెస్ (Friendship Day Wishes For Him)
 5. మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి పంపే ఫ్రెండ్ షిప్ డే సందేశాలు (Friendship Day Messages For Best Friend)
 6. ఫేస్ బుక్ స్టేటస్ లో పెట్టె ఫ్రెండ్ షిప్ డే మెసేజెస్ (Friendship Day Status For Facebook)
 7. వాట్సాప్ స్టేటస్ లో పెట్టె ఫ్రెండ్ షిప్ డే మెసేజెస్ (Friendship Day Status For Whatsapp)
 8. స్నేహితులకి పంపే ఫన్నీ ఫ్రెండ్ షిప్ డే మెసేజెస్ (Funny Friendship Day Messages)

ఈ క్రమంలోఫ్రెండ్ షిప్ డేఅనేది ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? దాని కథా, కమామీషు ఏమిటి.. మొదలైన విషయాలనుమనమూ తెలుసుకుందాం…

స్నేహితుల దినోత్సవం చరిత్ర (Friendship Day History)

అమెరికాలో.. 1930 సంవత్సరంలో హాల్ మార్క్ కార్డ్స్ కంపెని అధినేత జాయిస్ హాల్ మొదటిసారిగా ‘ఫ్రెండ్‌షిప్ డే’ అనే ఒకరోజుని ప్రతిపాదించారు. ఆ వేడుకకి సంబంధించిన కార్డ్స్ మార్కెట్‌లోకి విడుదల కూడా చేశారు. అప్పుడే ఫ్రెండ్‌షిప్ డేకిఅంకురార్పణ చేయడం జరిగింది. కాకపోతే ఆ కార్డ్స్ కేవలం గ్రీటింగ్ కార్డ్స్ మాత్రమే అని..బిజినెస్ కోసమే ఇటువంటి ఒక రోజుని మొదలుపెట్టారనివిమర్శలు వచ్చాయి.

అలా 28 ఏళ్ళు గడిచాక, జులై 30, 1958 తేదిన పరాగ్వే దేశంలో.. తొలిసారి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని (International Friendship Day) ప్రతిపాదించడం జరిగింది. దీనిని ప్రతిపాదించింది – వరల్డ్ ఫ్రెండ్ షిప్ క్రూసేడ్ అనే సంస్థ.

అలా మొదలైన ఈ ఫ్రెండ్‌షిప్ డే సంస్కృతి నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ప్రజలందరూ ఈ ‘ఫ్రెండ్‌షిప్ డే’ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.

స్నేహమేరా జీవితం: ఫ్రెండ్‌షిప్ విలువను తెలియజెప్పే 40 కొటేషన్లు

అయితే ఈ ‘ఫ్రెండ్‌షిప్ డే’ని ప్రపంచమంతా ఒకే రోజు జరుపుకోకపోవడం గమనార్హం. ఒక్కొక దేశంలో ఒక్కోరోజు ఈ రోజును జరుపుకుంటారు. మన భారతదేశంలో అయితే.. ప్రతి ఏడాది ఆగష్టు మొదటి ఆదివారం ‘ఫ్రెండ్ షిప్ డే’ని చేసుకోవడం జరుగుతుంది. మన దేశంతో పాటుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్, అలాగే కొన్ని అరబ్ దేశాలు ఒకే రోజు ‘ఫ్రెండ్ షిప్ డే’ని జరుపుకుంటున్నాయి.

ఇక సౌత్ అమెరికన్ దేశాలు జులై 20 తేదిన ఈ ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు జరుపుకుంటే, అమెరికాలో మాత్రం ఫిబ్రవరి 15 తేదిన స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. ఆసక్తికరమైన మరో విశేషమేమంటే మన దాయాది దేశమైన పాకిస్తాన్ జులై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

ఇలా ఒకే అంశానికి చెందిన రోజుని వివిధ దేశాలు.. వివిధ రోజుల్లో జరుపుకోవడం నిజంగా ఒక వింతే! దీనికే ఇంత షాక్ అవుతుంటే… నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే అని కూడా ఒకటి వెలుగులోకి రావడం.. ఇప్పుడు దానిని కూడా ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రజలు జరుపుకోవడం ఇంకాస్త ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.జూన్ 8 తేదిన ఈ ‘నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే’ని జరుపుకుంటారు. అయితే దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదు.మనదేశంలో కూాడా ఎవరూ దీనిని చేసుకోవడం లేదు.

ఇక ఒకప్పుడు ఫ్రెండ్‌షిప్ డే విషెస్ చెప్పుకోవాలంటే.. అందరూ గ్రీటింగ్ కార్డ్స్ఇచ్చిపుచ్చుకొనేవారు.ఆ తరువాత కాలంలో స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తుండేవారు. క్రమక్రమంగా ఈ సంస్కృతి తగ్గి ప్రస్తుతం సోషల్ మీడియాని వేదికగా చేసుకుని..ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా స్నేహితులకి ఫ్రెండ్‌షిప్ డే విషెస్ పంపిస్తున్నారు.

ఈ క్రమంలో మనం కూడా ఫ్రెండ్‌షిప్ డేసందర్భంగా.. మన స్నేహితులకు ఫేస్బుక్,వాట్సాప్వేదికల ద్వారా పంపించే స్పెషల్ విషెస్ గురించి తెలుసుకుందాం

‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!- Friendship Day Quotes (1)

Movie Still

ఫ్రెండ్ షిప్ డే కోట్స్ (Friendship Day Quotes In Telugu)

ఇప్పుడు మనం ఫ్రెండ్ షిప్ డే రోజున మన స్నేహితులకి పంపించడానికి అనువైన.. 10 ఆసక్తికరమైనఫ్రెండ్ షిప్ డే కోట్స్ చూసేద్దాం.

 • జగతిలో స్నేహానికి అడ్డులేదు… ఏది అడ్డు కాదు కూడా.
 • స్నేహం చిన్న విషయం కాదు… ఎంత పెద్ద సమస్యనైనా చిన్నదిగా మార్చే సాధనం
 • ఆపదలో అవసరాన్ని… బాధలో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు
 • ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టలేనిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది & స్నేహం మరువరానిది
 • స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పులేదు… కాని మోసం చేయడానికి స్నేహం చేయకూడదు.
 • నిజాయితీ & నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు.
 • నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేది ‘ప్రేమ’.. నేను లేకపోయినా నువ్వు ఉండాలని కోరుకునేది ‘స్నేహం’.
 • స్నేహమంటే మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు … స్నేహమంటే మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేది..
 • స్నేహానికి కులం, మతం & డబ్బు ఏనాటికి అడ్డంకులు కావు
 • స్నేహం చేయడానికి తొందరపడవద్దు… ఒకసారి చేశాక ఎప్పటికి వదలద్దు.
 • ఇవి మీ మిత్రుల గుండెని తాకే 10 ఫ్రెండ్ షిప్ డే మెసేజస్. ఇందులో మీకు నచ్చినవాటిని ఎంపిక చేసుకుని మీ స్నేహితులకి త్వరగా పంపించేయండి మరి.

మీ ప్రియమైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలా చెప్పండి (Happy Birthday Wishes In Telugu)

‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!- Friendship Day Quotes (2)

స్నేహితురాలి కోసం ఫ్రెండ్ షిప్ డే మెసేజస్.. (Friendship Day Wishes For Her)

మీ ప్రియనేస్తమైన స్నేహితురాలికి.. ఫ్రెండ్ షిప్ డే విషెస్ పంపడానికి ఈ మెసేజెస్తప్పక పనికొస్తాయి.

 • నా జీవితంలో తల్లిదండ్రులని, తోబుట్టువులని నేను ఎంచుకోలేకపోయాను … కాని నిన్ను, నీ స్నేహాన్ని ఎంచుకోగలిగాను.
 • నీ ఆనందంలో తోడున్నా లేకపోయినా… నీకు ఎదురయ్యే ఆపద ముందు నేనుంటా!!
 • స్నేహానికి ఒక అందమైన రూపమంటూ ఒకటుంటే.. అది నీవే
 • నీతో స్నేహం చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించకపోవడమే.. నేను చేసిన ఒక మంచి పని
 • నేను తప్పుచేసినా సరే ఎప్పుడు భయపడను! ఎందుకంటే… నా పక్కన నువ్వు ఉంటావన్న ధైర్యం
 • నా విజయంలో సింహ భాగం.. మన స్నేహానిదే.
 • జీవితంలో సంతోషాన్నిచ్చే వాటిలో.. స్నేహం ముందు వరుసలో ఉంటుంది.
 • నీతో స్నేహం.. నా జీవితంలో వచ్చిన ఒక మంచి మార్పు.

కుటుంబం అంటేనే సంతోషం .. (ఈ కొటేషన్లు కచ్చితంగా మీ ఫ్యామిలీని గుర్తుచేస్తాయి)

 • నేను ఎప్పుడు టెన్షన్‌లో ఉన్నా … గుర్తుకు తెచుకునేది నీ పేరే…
 • నా జీవితంలో ఎన్నటికి మర్చిపోలేనిది నీతో స్నేహం…

మీ స్నేహితుడికి పంపే ఫ్రెండ్ షిప్ మెసేజెస్ (Friendship Day Wishes For Him)

మీ బెస్ట్ ఫ్రెండ్‌కి ఎటువంటి సందేశం పంపాలని తికమక పడుతున్నారా? కచ్చితంగా మీ తికమకని ఈ క్రింది సందేశాలు దూరం చేస్తాయి.

 • డబ్బు లేని వాడు పేదవాడు.. స్నేహితుడు లేనివాడు దురదృష్టవంతుడు.
 • స్నేహానికి పర్యాయ పదమే నువ్వు
 • స్నేహానికి చిరునామా అని నన్ను ఎవరైనా అడిగితే.. నీ చిరునామా ఇచ్చేస్తాను
 • స్నేహం అనే మార్గంలో.. నాకు దారి చూపిన దీపానివి నీవు
 • స్నేహానికి అసలైన నిర్వచనం ఏంటి అంటే .. అది నా పైన నీకున్న ప్రేమే.
 • డబ్బు నాకు సుఖాన్నిస్తే… నీ స్నేహం నాకు వెలకట్టలేని ఆనందాన్నిచ్చింది.
 • స్నేహంలో మొదటి అక్షరం నేనైతే… రెండో అక్షరం నువ్వు
 • స్నేహం అనే సముద్రంలో నాకు దొరికిన ఆణిముత్యానివి నువ్వు
 • మన స్నేహానికి ఎటువంటి అడ్డుగోడలు నిలబడలేవు
 • మన స్నేహం ఇన్నాళ్లు బ్రతికుందంటే అది కేవలం నీవల్లే…

ఇవి మీ స్నేహితుడికి ఫ్రెండ్ షిప్ డే రోజు పంపించగలిగే 10 ప్రత్యేకమైన సందేశాలు … కచ్చితంగా ఈ పైన చెప్పినవాటిలో ప్రతీ ఒకటితనకు నచ్చి తీరుతుంది.

మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలా క్రియేటివ్ గా చెప్పండి.

‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!- Friendship Day Quotes (3)

మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి పంపే ఫ్రెండ్ షిప్ డే సందేశాలు (Friendship Day Messages For Best Friend)

మీ ప్రాణ స్నేహితులకు పంపించదగ్గ.. 10 ప్రత్యేకమైన సందేశాలు మీకోసం

 • అరేయ్.. మన స్కూల్‌లో ఉన్న ప్రతి చెట్టు మన స్నేహానికి సాక్ష్యమే
 • ఫ్రెండ్ షిప్ డే రోజు మాత్రమే కాకుండా.. ప్రతిరోజు గుర్తుపెట్టుకోదగ్గ స్నేహం మనది.
 • ఏ స్కూల్ బస్ ని చూసినా… మనం చిన్నపుడు స్కూల్ బస్‌లో చేసిన అల్లరే కళ్ళముందు కనిపిస్తుంది.
 • స్నేహానికి ఒక గ్రూప్ అంటూ ఉంటే.. అది మన ఫ్రెండ్స్ గ్రూప్ అని గర్వంగా చెప్పగలను.
 • కాలేజీలో మన ఫ్రెండ్స్ గ్రూప్‌కి ఉన్న ఫాలోయింగ్.. నేను ఎప్పటికి మర్చిపోలేను.
 • నాకు ఏదైనా సమస్య వచ్చిందని తెలియగానే.. నా ముందుకి పరిష్కారంతో సహా వచ్చేసేవాడివి నువ్వొక్కడివే.
 • జీవితంలో నాకు మన స్నేహం ఇచ్చినంతగా కిక్కు.. మరే ఇతర విషయం కూడా ఇవ్వలేకపోయింది.
 • నా జీవితంలో ఏమాత్రం కూడా కష్టపడకుండా దొరికింది.. నీ స్నేహం మాత్రమే.
 • నేను బాధలో ఉన్నప్పుడు.. నీ ఓదార్పు నాకు ఎంతో మనశ్శాంతినిని ఇచ్చింది
 • స్నేహం అనే క్రికెట్‌లో మనల్నిద్దరిని అవుట్ చేసేవారే లేరు.

ఈ పైన చెప్పిన 10 సందేశాలు.. మీ బెస్ట్ ఫ్రెండ్‌కి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా పంపించవచ్చు.

‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!- Friendship Day Quotes (4)

ఫేస్ బుక్ స్టేటస్ లో పెట్టె ఫ్రెండ్ షిప్ డే మెసేజెస్ (Friendship Day Status For Facebook)

ఫేస్‌బుక్‌‌లో ఫ్రెండ్ షిప్ డే రోజున స్టేటస్ పెట్టుకోవడానికి.. సరిపోయే పది సందేశాలు మీకోసం

 • మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలమో వారే స్నేహితులు
 • ద్వేషించడానికి క్షణ కాలం సరిపోతుందేమో! అదే స్నేహానికి మాత్రం ఒక జీవిత కాలం పడుతుంది.
 • మన స్నేహం గొప్పతనాన్ని వర్ణించడానికి నావద్ద మాటలు లేవు. కేవలం నీ పైన ఉన్న స్నేహం తప్ప .
 • జీవితంలో మనం ఓడిపోయినప్పుడు… మన వెన్నుతట్టే వారిలో ఒక స్నేహితుడు/స్నేహితురాలు కచ్చితంగా ఉంటారు.
 • మన స్నేహంలో మొదటి అంకం నేనైతే.. చివరి అంకం నువ్వు
 • ఎదుటివారు చూసి మరీ ఈర్ష్యపడేంత గొప్పది మన స్నేహం
 • గెలుపోటములకు అతీతమైన బంధం – స్నేహం.
 • తాను ఓడిపోయినా సరే.. తన నేస్తం గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన బంధమే స్నేహం.
 • ప్రతి బంధానికి ఆఖరి రోజు ఉంటుంది … ఒక్క మన స్నేహానికి తప్ప.
 • “దోస్త్ మేరా దోస్త్” అనే పాట.. మన ఇద్దరికోసమే రాసుంటారని నేను అనుకోని రోజంటూ ఉండదు.

వాట్సాప్ స్టేటస్ లో పెట్టె ఫ్రెండ్ షిప్ డే మెసేజెస్ (Friendship Day Status For Whatsapp)

వాట్సాప్‌లో మీ ఫ్రెండ్స్‌కి పంపించదగ్గ సందేశాలు మీకోసం..!

 • కన్నీళ్లు తెప్పించేవాడు కాదు… కష్టాల్లో తోడుండేవాడు స్నేహితుడు
 • తాను కష్టాల్లో ఉన్నా… తన వారి కష్టాలని తీర్చేందుకు ప్రయత్నించేవాడు స్నేహితుడు
 • మన అభిమతానికి అనుగుణంగా నడిచేవాడు స్నేహితుడు
 • అద్దం మనకు నిజమైన నేస్తం.. ఎన్నటికీ అబద్దం చెప్పదు.
 • నువ్వు జీవితంలో ముందుకి సాగడానికి కావాల్సిన వాటిల్లో ‘స్నేహం’ ఒకటి.
 • స్నేహంలో జీవితం ఉండదేమో కాని … స్నేహం లేని జీవితం ఉండదు.
 • ఈ ప్రపంచంలో పరిమితులు లేని బంధాలలో స్నేహం కూడా ఒకటి.
 • ప్రేమకి ఎప్పుడు ముందుండేది స్నేహమే.
 • ప్రేమ లేని స్నేహం ఉంటుందేమో.. కాని స్నేహం లేని ప్రేమ ఉండదు.
 • ఏ బంధానికైనా మొదటి అడుగు స్నేహమే.

స్వాతంత్య్ర సమరయోధులు పలికిన స్ఫూర్తిమంతమైన వాక్యాలు

స్నేహితులకి పంపే ఫన్నీ ఫ్రెండ్ షిప్ డే మెసేజెస్ (Funny Friendship Day Messages)

ఫ్రెండ్ షిప్ అంటేనే ఫన్. అటువంటిది ఫ్రెండ్ షిప్ డే రోజున ఫన్నీగా ఉండే మెసేజెస్ పంపిస్తే ఎలా ఉంటుంది. భలే బాగుంటుంది కదా..

 • క్లాస్ రూమ్‌‌లో నా పెన్సిల్ కొట్టేసినందుకు.. టీచర్ నిన్ను బాగా కొట్టిన రోజు నేను ఎప్పటికి మర్చిపోలేను. థాంక్స్! నీ స్నేహం ద్వారా నాకు ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చినందుకు.
 • జీవితంలో ఎదురైన కష్టాల్లోనే కాదు.. నేను ఇప్పటివరకు చూసిన ప్రతి సినిమాలో సైతం నా పక్కన ఉన్నది నువ్వే
 • నా ప్రియమైన స్నేహితుడా/శత్రువా… నా ప్రేమకథని ఏకంగా నా భార్యకే చెప్పిన ఘనుడా.. నిన్ను ఎప్పటికీ మర్చిపోను
 • క్లాస్ టాపర్‌గా ఉన్న నన్ను.. చాలా విజయవంతంగా లాస్ట్ బెంచ్ స్టూడెంట్‌గా చేసిన ఘనత తప్పకుండా నీకే దక్కుతుంది.
 • గెలిచినప్పుడు హడావుడి చేసినా.. ఓడిపోయినప్పుడు తిట్టినా అది నువ్వే.. నా నేస్తం.
 • స్నేహానికి పర్యాయ పదాలు అని మన గురించి అందరు చెబుతుంటారు కాని… అసలు మన కొట్టుకోకుండా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు అంటే.. వీళ్ళు నమ్మలేరేమో!
 • మన స్నేహానికి 25 ఏళ్ళ వయసైతే.. మన మధ్య జరిగిన మొదటి గొడవ వయసు 26.
 • ఈ మొత్తం ప్రపంచంలో సరిగ్గా ఫ్రెండ్ షిప్ డే రోజు.. గొడవపడే స్నేహితులం మనమేనేమో!
 • ‘హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే’ రా అని ఫోన్ చేస్తే… నన్ను అప్పు అడిగిన సంగతి నాకు ఇప్పటికి గుర్తే.
 • మనిద్దరం స్నేహానికే కాదు.. చాదస్తానికి కూడా ఒక బ్రాండ్ లాంటివాళ్ళం…
 • ఇవీ ఫ్రెండ్ షిప్ డే రోజు.. మీ స్నేహితులతో మీకెదురైన సరదా అనుభవాలగురించి రాసిన10 ఫన్నీ సందేశాలు.

చదివేసారుగా… మొత్తం 70 సందేశాలు. మరింకెందుకు ఆలస్యం వచ్చే నెలలో రాబోయే స్నేహితుల దినోత్సవానికి ఈ పై సందేశాలలో మీకు నచ్చినవాటిని.. మీ ప్రియమైన స్నేహితులకి పంపించి.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయండి. అలాగే ఈ పైన పోస్ట్ చేసిన సందేశాల కన్నా ఆసక్తికరమైనవి మీ దగ్గర ఉంటే.. ఈ క్రింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి.

फ्रेंडशिप डे कोट्स

గ్రాడ్యుయేషన్ చేయకపోయినా.. సినిమాలతో కోట్లు సంపాదించేస్తున్నారు..!

You might also like

Latest Posts

Article information

Author: Trent Wehner

Last Updated: 07/26/2022

Views: 5528

Rating: 4.6 / 5 (56 voted)

Reviews: 87% of readers found this page helpful

Author information

Name: Trent Wehner

Birthday: 1993-03-14

Address: 872 Kevin Squares, New Codyville, AK 01785-0416

Phone: +18698800304764

Job: Senior Farming Developer

Hobby: Paintball, Calligraphy, Hunting, Flying disc, Lapidary, Rafting, Inline skating

Introduction: My name is Trent Wehner, I am a talented, brainy, zealous, light, funny, gleaming, attractive person who loves writing and wants to share my knowledge and understanding with you.